ఉంగుటూరు మండలం గొల్లగూడెం విద్యుత్ సెక్షన్ కైకరం సబ్‌స్టేషన్ పరిధిలోని రామన్నగూడెంలో నూతన లైన్ల ఏర్పాటు నిమిత్తం శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు గొల్లగూడెం ఏఈ వేణు తెలిపారు. కైకరం, వెంకటకృష్ణాపురం, రామన్నగూడెం గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.