భీమడోలు మండలం పోలసానిపల్లిలో రేపు ఆవిష్కరణకు సిద్ధమవుతున్న డా. బి. ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి చెప్పుల దండ వేశారు. విషయం తెలుసుకున్న దళిత నాయకులు రోడ్డుపై బైఠాయించి నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న సీఐ విల్సన్ డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామం అంతా పోలీసుల అదుపులో ఉంది.