భీమడోలులో విషాదం: చెరువులో మునిగి ముగ్గురు మృతి

ఏలూరు జిల్లా భీమడోలు సమీపంలో బుధవారం విషాద ఘటన చోటు చేసుకుంది. కోమటిగుంట చెరువులో ప్రమాదవశాత్తు ముగ్గురు వ్యక్తులు మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్