ఉంగుటూరు మండలం గొల్లగూడెం, కైకరం సబ్ స్టేషన్ పరిధిలో రామన్నగూడెంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు గొల్లగూడెం ఏఈ వేణు తెలిపారు. నూతన లైన్లు ఏర్పాటు పనుల్లో భాగంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.