ఉంగుటూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ఉంగుటూరు మండలం నాచుగుంట జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. హనుమాన్ జంక్షన్ వెళ్తున్న లారీ నాచుగుంట వచ్చే సరికి జాయింట్ వీల్ విరిగిపోయింది. దీంతో డ్రైవర్ లారీ కిందకు దిగి చూస్తుండగా ఇంతలో పైనాపిల్ లోడుతో ఉత్తరప్రదేశ్ వెళుతున్న ఓ కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ కింద ఉన్న డ్రైవర్, పక్కనే ఉన్న మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.

సంబంధిత పోస్ట్