బొమ్మిడి గ్రామంలో జరిగిన అభివృద్ధి, జరగబోయే అభివృద్ధి, ఇంకా చేయవలసిన అభివృద్ధి గురించి గ్రామస్తులందరూ ఉమ్మడిగా చర్చించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఉంగుటూరు మండల పరిషత్ ఏఓ, ప్రత్యేక అధికారి ఆంజనేయ బాబు అన్నారు. గ్రామంలో శనివారం జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామస్తులు తమ సమస్యలను సభలో తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.