రైలు ఢీకొని మహిళ మృతి

భీమడోలు మండలం కోడూరుపాడు గ్రామంలో మంగళవారం సాయంత్రం రైలు ఢీకొని శిరీష అనే మహిళ మృతి చెందింది. బస్సు దిగి గ్రామానికి వెళ్లేందుకు రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఏలూరు రైల్వే పోలీసులు  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాక్‌మెన్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్