AP: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాటాడుతూ.. డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. NDA రూ.9.5లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో 8.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. 'తల్లికి వందనం' పథకాన్ని ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ ఇస్తామని పునరుద్ఘాటించారు.