సింహాచలం పులిహోర ప్రసాద వివాదంపై స్పందించిన ఈవో

AP: విశాఖపట్నంలోని సింహాచల దేవస్థానం పులిహోర ప్రసాదంలో నత్త కనిపించడం కలకలం రేపింది. దీనిపై సింహాచలం ఆలయ ఈవో స్పందించారు. ‘పులిహోర తయారీ 3 దశల్లో జరుగుతుంది. పులిహోర ప్రసాదంలో నత్త రావడం అసాధ్యం. రోజూ సుమారుగా 20 వేల ప్రసాదం ప్యాకెట్లు తయారు చేసి విక్రయిస్తాం. గత 31 ఏళ్లలో ఇలాంటి ఘటన జరగలేదు. పులిహోర ప్రసాదంలో కావాలనే నత్త పెట్టి ప్రచారం చేసినట్లు అనుమానం ఉంది. పోలీసులకు ఫిర్యాదు చేశాం’ అని ఆలయ ఈవో అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్