పసుపు పండుగకు అందరూ రండి: మంత్రి ఆనం

TDP ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'మహానాడు' వేడుకలకు నెల్లూరు జిల్లా సిద్ధమవుతోంది. పార్టీ 44 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఈ ప్రాంతంలో మహోత్సవం జరగనుంది. ఈ నెల 27, 28, 29 తేదీలలో కొడవలూరు మండలం, కిసాన్ సెజ్ ప్రాంగణంలో జరగనున్న ఈ వేడుకలకు తెలుగు తమ్ముళ్లందరికీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆహ్వానం పలికారు. రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ఈ చారిత్రాత్మక సభను విజయవంతం చేసేందుకు లక్షలాదిగా తరలిరావాలని, సమిష్టి కృషితో మహానాడును చిరస్మరణీయంగా మార్చుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్