ప్రతి ఒక్కరూ రైతులకు అండగా నిలవాలి: అచ్చెన్నాయుడు

AP: తుఫాన్ నేపథ్యంలో పంటలను కాపాడుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ రైతులకు అండగా ఉండాలని, కోతకు సిద్ధంగా ఉన్న పంటలు, ధాన్యం నిల్వలు దెబ్బతినకుండా రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు. వాతావరణం అనుకూలించిన వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి, రైతుల సమస్యలను తెలుసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా అధికారులు పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕