సీఎం చంద్రబాబు తుని టూర్‌కు సర్వం సిద్ధం

AP: కాకినాడ జిల్లాలోని తుని మండలం చామవరంలో జూన్ 1న సీఎం చంద్రబాబు పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రజావేదిక కార్యక్రమం, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, అలాగే పార్టీ క్యాడర్ మీటింగ్‌లో ఆయన పాల్గొననున్నారు. సీఎం పర్యటన భద్రత, ఏర్పాట్లపై కలెక్టర్ హరేంధిర ప్రసాద్ క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఐజీ అశోక్ కుమార్, ఎస్పీలు బిందు మాధవ్, రాహుల్ మీనా, జేసీ అపూర్వ భరత్ కూడా ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం రాకతో జిల్లాలో టీడీపీ శ్రేణుల్లో భారీ ఉత్సాహం నెలకొంది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్