ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగిస్తారా? లేక బ్యాలెట్ పేపర్లతో నిర్వహిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. తొలుత మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ, జడ్పీ ఎన్నికలు జరగనున్నాయి. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు భారీ సంఖ్యలో యంత్రాలు అవసరం కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం బ్యాలెట్ పేపర్ల వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లకు ప్రత్యక్ష ఎన్నికలు కూడా ఉండటంతో బ్యాలెట్ పత్రాల వినియోగం భారీగా ఉండనుంది. కాగా, దీనిపై తుది నిర్ణయం రాష్ట్ర ఎన్నికల సంఘమే తీసుకోనుంది.