AP: మాజీ సీఎం జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించడం పట్ల వైసీపీ నేత, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. జగన్ పర్యటనలో మితిమీరిన ఆంక్షలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం సృష్టిస్తున్న అడ్డంకులు.. ప్రజాదరణను, అభిమానాన్ని అడ్డుకోలేవని స్పష్టం చేశారు. నడిచి వచ్చే వాళ్లని కూడా అడ్డుకునేందుకు రోడ్లపై పెద్దఎత్తున బారికేడ్లు, ఇనుప కంచెలతో పహారా కాస్తున్నారని అన్నారు.