AP: మహిళలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇచ్చే అంశంపై ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్రంలో 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉండగా, అందులో దీపం పథకానికి అర్హులైనవారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక ఇంట్లో ఒకటికి మించి గ్యాస్ కనెక్షన్ ఉంటే పథకం అందదని తెలుస్తోంది. కరెంట్ బిల్స్, ఆధార్‌తో లింకైన ఫోన్ నంబర్, చిరునామా ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి అర్హులను గుర్తిస్తారని సమాచారం.