APలో స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) అనిల్ చంద్ర పునేఠా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో జరిగిన ఈ సమీక్షలో, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎన్నికల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. దశలవారీగా ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, ఈ ఏడాది ఫిబ్రవరి నాటి ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బ్యాక్సులు, ఇతర సామగ్రి సిద్ధంగా ఉన్నాయని SEC వెల్లడించారు.

సంబంధిత పోస్ట్

✕
✕