ఏపీ కేబినెట్ విస్తరణ.. ఆ ఐదుగురికి ఉద్వాసన?

ఏపీ కేబినెట్ విస్తరణ జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. జనసేన నేత, పవన్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి దక్కనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోనుందని తెలుస్తోంది. ఇప్పుడున్న కేబినెట్‌లో ఐదుగురికి ఉద్వాసన తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఏపీ మంత్రులు సుభాష్, రాంప్రసాద్ రెడ్డి, సవిత, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్‌పై చంద్రబాబు మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. నాగబాబును కేబినెట్‌లోకి తీసుకుంటామని చంద్రబాబు చేసిన ప్రకటనతో పార్టీలో చిన్నపాటి చిచ్చు రాజేసుకుంది.

సంబంధిత పోస్ట్