ఏపిలో మద్యం దుకాణాల రెన్యువల్ గడువును డిసెంబర్ 23వ తేదీ వరకు పొడిగించారు. మద్యం దుకాణాల యజమానులు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో దుకాణాల యజమానులకు రెన్యువల్ ప్రక్రియ పూర్తి చేసుకోవడానికి మరో రెండు రోజులు అదనపు సమయం లభించింది. ఈ పొడిగింపుతో మద్యం వ్యాపారులకు కొంత ఊరట లభించింది.