AP: శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలంలో దారుణం జరిగింది. బండవాండ్లపల్లికి చెందిన నవీన్ (35)) శుక్రవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లి గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రెండేళ్ల క్రితం నవీన్ భార్య ఆత్మహత్య చేసుకుంది.