AP: కర్నూలు జిల్లా ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల అధికారికి బీ-ఫారమ్ సమర్పించేందుకు వైసీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ ప్రియాంక సిద్ధమయ్యారు. బీ-ఫారమ్ ఇవ్వకుండా అడ్డుకునేందుకు మున్సిపల్ కార్యాలయం ముందు టీడీపీ నాయకులు భారీగా గుమిగూడారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి వెనక్కి తగ్గారు. అధికారంలో రెండున్నర ఏళ్లు టీడీపీ, మరో రెండున్నర ఏళ్లు వైసీపీ పంచుకునేలా చర్చలు జరుపుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.