AP: ప్రకాశం జిల్లా కనిగిరిలో సోమవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ, వైకాపా నాయకుల మధ్య వాగ్వాదం జరగడంతో పరిస్థితి వేడెక్కింది. YCP నాయకులు పోలీసుల బారికేడ్లను ధ్వంసం చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిరసనగా మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థితో పాటు పలువురు కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.