AP: శ్రీ సత్యసాయి జిల్లాలోని అగళి మండలం కొమరేపల్లి సచివాలయం నుంచి ఇతర రాష్ట్రాల వ్యక్తులకు వేలాది నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు జారీ అయినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా గణాంకాల అధికారులు తనిఖీ చేయగా, ఏడాదిగా 3,982 జనన ధ్రువీకరణ పత్రాలు జారీ అయినట్లు గుర్తించారు. వినయ్ కుమార్ గుప్తా అనే వ్యక్తికి ఆగస్టు 5, 1985న జనన ధ్రువీకరణ పత్రం నకిలీదని ఆశీష్ కుమార్ గుప్తా ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.