నకిలీ మద్యం కేసు: జోగి రమేష్‌ బ్రదర్స్‌కు రిమాండ్‌ పొడిగింపు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ సోదరులతో సహా నిందితుల రిమాండ్‌ను కోర్టు జనవరి 12వ తేదీ వరకు పొడిగించింది. పోలీసులు నిందితులను ఎక్సైజ్‌ కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం నిందితులను జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు, జోగి రమేష్‌ మూడోసారి బెయిల్ పిటిషన్‌ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

సంబంధిత పోస్ట్