ఫ్రస్ట్రేషన్‌తోనే తప్పుడు కేసులు: కేశినేని నాని

తనపై ఫ్రస్ట్రేషన్‌తోనే తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ ఎంపీ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టిన ఆయన, ఎంపీ కేశినేని చిన్నిపై విమర్శలు గుప్పించారు. దొంగ కంపెనీకి వేల కోట్ల విలువైన భూముల్ని కట్టబెడుతున్నారని, ప్రశ్నించినందుకు 14 నెలల తర్వాత తనపై కేసు పెట్టారని తెలిపారు. తాను లేఖ రాయడం వల్లే దొంగ కంపెనీకి భూములు కేటాయించలేదని, డీల్ అడ్డం తిరగడంతో కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని, అయితే తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తిలేదని కేశినేని నాని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్