పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో హత్యకు గురైన రషీద్ అనే యువకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ నరసరావుపేట మీదుగా వెళ్లారు. ఈ నేపథ్యంలో నరసరావుపేటలోని స్థానిక ఎస్ఆర్‌కేటీ కాలనీ వద్ద జగన్ అభిమానులను కలిసేందుకు కారును ఆపారు. ఈ సందర్భంగా ఓ అభిమాని కారు ఎక్కి జగన్‌కు ముద్దు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.