AP: రాష్ట్రంలో ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా మారింది. వైఎస్సార్ జిల్లా మైదుకూరుకు చెందిన ఓబులేసు యాదవ్ అనే రైతు, తన రెండు ఎకరాల ఉల్లి పంటకు మద్దతు ధర లేక తీవ్ర ఆవేదన చెంది ఆ పంటను కాల్వలో పారబోశారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ, అది రైతుకు దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్‌లో ధరలు పడిపోవడం, కొనుగోలు కేంద్రాలు సక్రమంగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.