రైతుల సంక్షోభం, హక్కులపై పార్లమెంట్‌లో పోరాడాలి: జగన్

AP: రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభం, రాష్ట్ర హక్కుల సాధన కోసం పార్లమెంట్‌లో పోరాడాలని YCP అధినేత జగన్ ఎంపీలకు సూచించారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తాడేపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన ఈ దిశానిర్దేశం చేశారు. తుఫాను నష్టం, పంటలకు కనీస మద్దతు ధర లభించకపోవడం వంటి అంశాలపై దృష్టి సారించాలని, మొంథా తుపానుతో దెబ్బతిన్న పంటలకు, ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని ప్రస్తావించాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్