AP: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించిన మాజీ సీఎం వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. వైసీపీ హయాంలో కేజీ పొగాకు ధర రూ.289 ఉండగా, ఇప్పుడు రూ.236 మాత్రమే పలుకుతోందని, పెట్టుబడి పెరుగుతూ రాబడి తగ్గుతోందని, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.