AP: రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధర, యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వారి సమస్యలు పట్టవా అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వైసీపీ హయాంలో చేసిన శంకుస్థాపనలనే కూటమి ప్రభుత్వం మళ్లీ చేస్తోందని, ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని ఆయన ఆరోపించారు.