AP: కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని, అరటి పంట రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందని మాజీ సీఎం జగన్ అన్నారు. బుధవారం బ్రహ్మణపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు వల్లే.. రైతుల బతుకులు అగమ్యగోచరంగా మారింది. వైసీపీ హయాంలో అరటి పంట టన్ను రూ.30 వేలు పలికింది. 3 లక్షల పంటను ఎక్స్‌పోర్ట్ చేశాం. ఇప్పుడు టన్ను రూ.2 వేలకు కూడా కొనేవారు లేరు. కూటమి ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసే రోజులు దగ్గర్లో ఉన్నాయి’ అని అన్నారు.