పొగాకు కొనుగోళ్లపై రైతులకు ఆందోళన వద్దు: మంత్రి అచ్చెన్నాయుడు

AP: తెల్ల, నల్ల బర్లి పొగాకు పండించే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకును తక్షణమే కొనుగోలు చేయడానికి పొగాకు కంపెనీలు ఐటీసీ, జీపీఐ, డెక్కన్‌ టొబాకో, బిటీసి సంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా సంస్థలకు పొగాకు కొనుగోలు విషయంపై ఆదేశాలిచ్చామన్నారు. జీపీఐ సంస్థ గురువారం నుంచే పొగాకు కొనుగోళ్లు ప్రారంభించిందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్