శ్రీనివాసుని కల్యాణంలో రైతులంతా పాల్గొనాలి: బీఆర్‌ నాయుడు

AP: సీఎం చంద్రబాబు సూచనతో రాజధాని ప్రాంత రైతులతో సమావేశమైనట్లు టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రైతులు ఉద్యమించారని, రైతు బిడ్డగా తాను వారి వెంట ఉండాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. విజయవాడ, రాజమహేంద్రవరంలో రైతుల పాదయాత్రలో పాల్గొన్నట్లు గుర్తు చేశారు. ఈ నెల 15న జరిగే శ్రీనివాసుని కల్యాణంలో రైతులంతా పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్