రైతు కన్నీరు రాష్ట్రానికి అరిష్టం: పేర్ని నాని

AP: రాష్ట్రంలో యూరియా, డీఏపీ దొరక్క రైతులు కష్టాలు పడుతున్నారని, కరెంట్ కోతలు కూడా మొదలయ్యాయని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ వైసీపీ సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ.. రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వమైనా కూలిపోతుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్‌పై చంద్రబాబు ముఠా 'మతం' పేరుతో విషయుద్ధం చేయబోతోందని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేసేలా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕