మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌‌పై ఫ్యాషన్ డిజైనర్ ఫిర్యాదు

కర్నూలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌పై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఫ్యాషన్ డిజైనర్ పి. శోభారాణి ఫిర్యాదు మేరకు, వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తానని రూ.3.70 కోట్లు తీసుకుని మోసం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోసారి ఫిర్యాదు చేయడంతో, హఫీజ్ ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని కర్నూలు ఎస్పీని మహిళా కమిషన్ ఆదేశించింది. దీంతో ఆయనపై పోలీసులు త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్