ఏలూరు జిల్లా దెందులూరు వేగవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ బైక్ ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదం తర్వాత బైక్ నుంచి పెట్రోల్ లీకై నడిరోడ్డుపై మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.