చెట్టుని ఢీకొట్టిన బైకర్.. ఒకరు మృతి

AP: తూర్పుగోదావరి జిల్లా, కోరుకొండ మండలం నరసాపురం శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన డ్యూక్ బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలియగానే స్థానికులు స్పందించి, క్షతగాత్రుడిని మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕