AP: కాకినాడ జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో పెళ్లింట విషాదం నెలకొంది. మల్లేపల్లికి చెందిన శ్రీను అనే యువకుడు కాట్రావులపల్లి వద్ద లారీ ఢీకొట్టడంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మరికొన్ని రోజుల్లో శ్రీనుకి పెళ్లని, దాని కోసమే షాపింగ్ వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. శ్రీను మరణంలో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.