AP: పార్వతీపురం మన్యం జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పాచిపెంట మండలంలోని మాతుమూరు, పాంచాలి ఎంపీటీసీ స్థానాలను టీడీపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో తండ్రీకుమార్తెలైన జి. యుగంధర్, కావ్య ఎంపీటీసీలుగా విజయం సాధించారు. దీంతో టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.