కొడుకును దారుణంగా చంపిన తండ్రి

AP: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం పందలకుంట గ్రామంలో రౌడీషీటర్ భాను ప్రతాప్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంట్లో నిద్రిస్తున్న కొడుకును కొడవలితో నరికి చంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కొడుకు వేధింపులు భరించలేక తండ్రి రంగారెడ్డి ఈ హత్య చేసినట్లు సమాచారం. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న భాను ప్రతాప్ రెడ్డిని అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో తలపై కొడవలితో దాడి చేసి చంపినట్లు, అనంతరం తండ్రి పరారైనట్లు పోలీసులు తెలిపారు. వీఆర్వో ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కదిరి రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్

✕
✕