TG: హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కార్యాలయాన్ని ఆర్. కృష్ణయ్య, బీసీ యువజన సంఘం అధ్యకుడు జిల్లపల్లి అంజి ఆధ్వర్యంలో విద్యార్థులు ముట్టడించారు. మూడేండ్లుగా పేరుకుపోయిన రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజుల బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆయన విమర్శించారు. బీసీ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై అఖిలపక్ష నాయకులు పోరాడాలని ఆయన కోరారు.