డీమ్డ్ యూనివర్శిటీల్లో చదివినా ఫీజు రీయింబర్స్‌మెంట్: ఏపీ సర్కార్

AP: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. డీమ్డ్ యూనివర్శిటీల్లో యూజీ కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ (పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్) వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రాయోజిత పథకంతో అనుసంధానం చేసి, ఎస్సీలకు 60 శాతం, ఎస్టీలకు 75 శాతం నిధులు కేంద్రం నుంచి అందనున్నాయి. మిగిలిన రాష్ట్ర వాటాను పీ-4 విధానంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విద్యోన్నతికి చేయూత లభించనుంది.

సంబంధిత పోస్ట్