కర్రీ పాయింట్ వద్ద గొడవ.. ఏఎస్ఐ సస్పెండ్

AP: తిరుపతి సత్యనారాయణపురంలోని ఒక కర్రీ పాయింట్ వద్ద ఏఎస్ఐ రాములు, శీను అనే వ్యక్తితో మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించి గొడవపడ్డారు. రోడ్డుపైనే పిడిగుద్దులతో ఘర్షణ పడడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాలతో రాములును శుక్రవారం సస్పెండ్ చేశారు. అలిపిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్