AP: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీలో అంతర్గత విభేదాలు తీవ్రమవుతున్నాయి. మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వర్గాల మధ్య ఫ్లెక్సీ వివాదం రచ్చకు దారితీసింది. బుట్టా రేణుక ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేయగా, అది చెన్నకేశవరెడ్డి వర్గీయుల పనేనని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటనతో ఇరువర్గాల మధ్య వైరం మరింత పెరిగింది.