వివాదంలో సినీ నటి చాందిని చౌదరి

AP: విశాఖపట్నంలో అభివృద్ధి పేరుతో కొండలను తవ్వడంపై సినీ నటి చాందిని చౌదరి చేసిన సోషల్ మీడియా పోస్ట్ వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ మద్దతుదారులు ఆమెను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడంతో పరిస్థితి వేడెక్కింది. దీనిపై స్పందించిన చాందిని చౌదరి.. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉండాలని, ప్రభుత్వంలో ఎక్కడ తప్పు జరిగినా దాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని బదులిచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

సంబంధిత పోస్ట్

✕
✕