AP: సంక్రాంతి పండుగకు నగరవాసులు సొంత గ్రామాలకు వస్తున్నారు. దాంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వై జంక్షన్ వద్ద అండర్‌పాస్ వంతెనకు అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో.. వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. దాంతో సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఆర్ అండ్ బీ శాఖ వీలైనంత వరకు రోడ్డు మరమ్మతులు చేస్తే బాగుటుందని ఆయన చెప్పారు.