AP: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్‌కు గురైన గాదె సాయికృష్ణ కుటుంబానికి వైసీపీ అండగా నిలిచింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో సాయికృష్ణ నివాసానికి వెళ్లిన వైసీపీ నేతలు అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, సింహాద్రి రమేష్, అడపా శేషు విజయలక్ష్మిని పరామర్శించి, రూ.20 లక్షల చెక్కును అందజేశారు.