AP: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. సిద్ధమ్మ గారి పల్లెకు చెందిన ఉపేంద్ర (35) అనే వ్యక్తి ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను బెంగళూరులో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసేవారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగా మద్యానికి బానిసై స్వగ్రామానికి వచ్చి కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య కృష్ణవేణి, పది నెలల కుమారుడు ఉన్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.