AP: పల్నాడు జిల్లాలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట గాంధీపేట 4వ లైన్లోని నివాస భవనంలో అగ్నిప్రమాదం జరిగి రెండో అంతస్తులోని స్టోర్ దగ్ధమైంది. స్థానికులు అప్రమత్తమై కింద అంతస్తులోని వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.