విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ పరిధిలో ఉన్న సీ హార్స్ జంక్షన్ సమీపంలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జె.ఎం.భక్షి కంపెనీకి చెందిన ఐరన్ ఓర్ తరలించే కన్వేయర్ బెల్టులో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా వ్యాపించాయి. ఈ ఘటనతో పోర్టు ప్రాంగణంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని, మంటలను అదుపులోకి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.