AP: మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌కు నిరసన సెగ తగిలింది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటిని టీడీపీ శ్రేణులు ముట్టడించారు. కొందరు వ్యక్తులు జోగి రమేశ్ ఇంటికి నిప్పంటించారు. దాంతో జోగి రమేశ్ ఇంటి బాల్కనీలో భారీగా మంటలు వ్యాపించాయి. దాంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కార్యకర్తలను చెదరగొట్టారు.